- Advertisement -
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. దీంతో సాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు సాగర్ జలాశయం 14 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులుగా ఉంది. సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో చూసేందుకు పర్యటకులు తరలిస్తున్నారు. దీంతో సాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.
- Advertisement -