- Advertisement -
హైదరాబాద్: నాగార్జున సాగర్ మనకు ఆధునిక దేవాలయం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. సాగర్ నుంచి గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్ల తర్వాత జులైలోనే నాగార్జున సాగర్ జలాశయం నిండిందని తెలియజేశారు. సాగర్ కు దివంగత ప్రధాని నెహ్రూ గాంధీ పునాది(Nehru Gandhi laid foundation Sagar) వేస్తే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారని, 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించి గొప్ప ప్రాజెక్టు ఇది అని కొనియాడారు. సాగర్ కాలువల ద్వారా రెండు రాష్ట్రాల్లోని ప్రతీ ఎకరాకు నీరు చేరిందని, మన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పండిందని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.
- Advertisement -