Tuesday, July 29, 2025

నాగార్జునసాగర్ జలాశయం క్రష్ట్ గేట్ల ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువనున్న జలాశయాలు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాజెక్టులన్ని నిండుకుండాల మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం క్రష్ట్ గేట్లు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 1,47,195 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు వచ్చి చేరుతుంది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 584.40 అడుగులకు చేరుకోవడంతో నేడు భారీ నీటిపారుదల, పౌరసరఫరాల,ఆహార శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, షెడ్యూల కులాలు, షెడ్యూల్ తెగలక మైనార్టీ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్డు భవనాల, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై సాగర్ జలాశయం రేడియల్ క్రష్ట్ గేట్లను ఎత్తి 50 వేల క్యూస్సేక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… ఎన్‌ఎస్పీ అధికారులు
నేడు నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నదిలోకి స్నానికి గాని, ఈతకు వెళ్లవద్దని, మత్స్యకారులు చేపలు పట్ట్టేందుకు నదిలోకి వెళ్ళవద్దని ,పశువులు , గేదేలు, మేకల వంటి వాటిని నదిలోకి తీసుకువెళ్లకూడదని ఎన్‌ఎస్పీ అధికారులు సూచించారు.

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 584.70 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 296.5695 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,785 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 5394 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాల్వద్వారా 6634 క్యూసెక్కుల నీటిని,ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని,లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుండి మొత్తం 42,913 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News