Friday, August 1, 2025

నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువనున్న జలాశయాలు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాజెక్టులన్ని నిండి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.గురువారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం 8 క్రష్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి మరియు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ మొత్తం 2,82,609 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు వచ్చి చేరుతుండటంతో ఎన్‌ఎస్పి అధికారులు 26 క్రష్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,96,742 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువనుండి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి వచ్చిన

నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 585.10 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 297.7235 టీఎంసీల నీరు నిల్వ ఉంది.జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,273 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 8604 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాల్వద్వారా 7110 క్యూసెక్కుల నీటిని,ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుండి మొత్తం 2,43,829 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ డ్యామ్ 26గేట్ల నుండి దిగువకు విడుదలవుతున్న సుందరమైన నీటి దృశ్యాల అందాలను ప్రత్యక్షంగా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.హిల్ కాలనీలోని లాంచీ స్టేషన్ వద్ద, పైలాన్ కాలనీలోని కొత్త బ్రిడ్జి,పాత వంతెన, డ్యామ్ ఎంట్రన్స్ భాగంలో పర్యాటకుల సందడి వాతావరణం నెలకొంది. సాగర్ అందాలను తనివితీరా చూస్తూ తమ ఆనందాన్ని తోటి వారితో పంచుకుంటున్నారు.డ్యామ్ దిగువ భాగాన పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News