హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగోల్ (Nagole) పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య గొంతు భర్త కోశాడు. దీంతో వెంటనే ఆమెను సుప్రజ ఆస్పత్రికి (Supraja Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత సంవత్సరం మహాలక్ష్మి(20)ని వేణుగోపాల్ కు వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకలో అల్లుడికి రూ. 20 లక్షల కట్నం ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. అదనపు కట్నం తీసుకరావాలని పెళ్ళైన నెల నుండే భార్యను పలుమార్లు చితకబాదాడు.
Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?
పెద్దల సమక్షంలో భర్త కౌన్సిలింగ్ ఇచ్చిన కూడా అతడి తీరు మారలేదు. ఆదివారం ఉదయం భార్యతో గొడవ పడి ఆమె గొంతు కోశాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సుప్రజ ఆస్పత్రికి తరలించారు. భర్త వేణుగోపాల్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఎమెర్జెన్సీ సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి రాలేదు. అణా పైస చెల్లించకున్న సదరు మహిళ ప్రాణాలను కాపాడేందుకు సుప్రజా ఆస్పత్రి యాజమాన్యం చికిత్స అందిస్తుంది. మొదట ఆమె ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో సర్జరీ కూడా ప్రారంభించారు.