Saturday, August 2, 2025

ఫార్మా యూనిట్ పేలుడు.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. భిల్గావ్‌లోని అంకిత్ పల్ప్స్ అండ్ బోర్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లోని గ్లాస్ లైన్ రియాక్టర్ లోపల పేలుడు సంభవించిందని పోలీసు అధికారులు తెలిపారు. రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం కాంప్టీ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News