- Advertisement -
హైదరాబాద్: ఎంఎల్‌సి కవితను జైలు నుంచి బయటకు తీసుకరావడానికి బిజెపి వాళ్ల కాళ్లను కెటిఆర్ పట్టుకున్నారని ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తానన్న కవిత మాటాలకు కెటిఆర్ ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు. సొంత చెల్లి కవిత విభేదించడం కన్నా పెద్ద సాక్ష్యాలు కావాలా? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఎవరు అభివృద్ధి చేశారో ప్రజల సమక్షంలో తేల్చుకుందామని కెటిఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తాను చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే రాజకీయాల నుంచి కెటిఆర్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్‌ను పదేళ్ల చేసిన అభివృద్ధి కంటే 18 నెలల్లో తాము ఎక్కువగా అభివృద్ధి చేశామని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -