Thursday, August 14, 2025

నల్లగొండలో హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

నల్గొండలో జిల్లాలో హత్యాచారం కేసులో నిందితుడిని ఉరిశిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2013 లో నల్గొండకి చెందిన 12 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసి చంపేసి కాలువలో పడేశాడు. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు విషయంలో గత పది సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. గురువారం హత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించడంతో రూ. 1.10 లక్షలు జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News