రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎసిబి అధికారులు
మన తెలంగాణ / నల్లగొండ రూరల్ : నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. చరిత రెడ్డి లంచం స్వీకరిస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల ప్రకారం.. ఫిషరీస్ కోఆపరేటి వ్ సొసైటీకి కొత్త సభ్యుల అనుమతుల కోసం కేతపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ఫిర్యాదుదారుని నుంచి రూ.20,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. అధికారి సూ చన మేరకు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్న లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిణి తన పదవిని దుర్వినియోగం చేసి అవినీతిపరంగా వ్యవహరించినట్టు తేలడంతో ఆమెను అరెస్టు చేసిన ఏసిబి అధికారులు, హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ ఏసిబి ప్రత్యేక కోర్టుకు హాజరు పరిచారు.
కేసు దర్యాప్తులో ఉంది. లంచం డిమాండ్ జరిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అదేవిధంగా ద్వారా కూడా సమాచారం అందించవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసిబికి పట్టుబడిన ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ సరిత రెడ్డికి సంబంధించిన కు టుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక టీంలు తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు. లంచం తీసుకు ంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చరిత రెడ్డిని శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కో ర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.