Wednesday, July 23, 2025

రెచ్చిపోయిన ఆకతాయిలు.. ఆర్టిసి బస్సుకు నిప్పు

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ: నల్లొండ జిల్లా మిర్యాలగూడ మండలం (Nalgonda Miryalaguda) తడకమళ్ల గ్రామంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్డ్ ఆర్టిసి బస్సుకు నిప్పుపెట్టారు. మిర్యాలగూడ డిపోనకు చెందిన టిఎస్ 05 జెడ్ 0047 నెంబర్ బస్సు రోజులానే గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ కూడలిలో పార్కింగ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు బస్సు వెనుక వైపు నుంచి నిప్పు పెట్టారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్, కండక్టర్.. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో బస్సు వెనక భాగం టైర్లతో సహా పూర్తిగా కాలిపోయింది. నిప్పు పెట్టిన ఆకతాయిల గురించి పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News