Wednesday, May 14, 2025

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. నల్గొండ విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో నల్గొండ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) ఎమ్మెస్సి చదువేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సిలో పూర్తి చేసిన ప్రియాంక.. అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తోంది.

అయితే, ప్రియాంక దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యులు టెస్టులు చేసి ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్నేహితులు.. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు.. బ్రెయిన్ డెడ్ అయ్యిందని.. దాంతో ప్రియాంక మరణించినట్లు నిర్ధారించారు. పై చదువుల కోసం వెళ్లిన కూతురు మరణవార్త విని ప్రియాంక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News