- Advertisement -
మంత్రి కొండా సురేఖా నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కెటిఆర్ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నెల 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి.. మంత్రికి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని.. అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోవడానికి కెటిఆరే కారణం అంటూ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
- Advertisement -