Sunday, August 10, 2025

చెల్లితో ప్రేమాయణం…. స్నేహితుడిని చంపిన అన్న

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తనతో స్నేహంగా ఉంటూనే తన చెల్లి ప్రేమించాడని స్నేహితుడిని అన్న కాల్చి చంపాడు. ఈ సంఘటన ఢిల్లీలోని నంద నగ్రి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శివమ్, కపిల్ అనే స్నేహితులు ఉన్నారు. శివమ్ చెల్లితో కపిల్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయం శివమ్ కు తెలియడంతో కపిల్ చంపాలని నిర్ణయం తీసకున్నాడు. కపిల్ తన తండ్రి పాత దుస్తులు కుట్టించేందుకు టైలర్ షాపుకు వచ్చాడు. శివమ్ అతడి వద్దకు వెళ్లి అతి దగ్గర నుంచి కపిల్ కాల్చాడు. వెంటనే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News