హైదరాబాద్: నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టిఆర్ కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ(73) (Nandamuri Padmaja) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆమెను తెల్లవారుఝామున ఆస్సత్రికి తరలించారు. అస్పత్రిలో వైద్యం పొందుతూ.. ఆమె తుదిశ్వాస విడిచారు. నందమూరి పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి. పద్మజ మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఎపి సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పద్మజ మృతికి సంతాపం తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇక హీరో నందమూరి చైతన్యకృష్ణ.. పద్మజ (Nandamuri Padmaja), జయకృష్ణల కుమారుడే. సుమారు రెండు సంవత్సరాల క్రితం చైతన్యకృష్ణ ‘బ్రీత్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ, సినిమా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.5 లక్షలు కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో ఆయన మరో సినిమా చేయలేదు.