Wednesday, August 20, 2025

చికిత్స పొందుతూ యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నందిగామ: చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం షాబాద్ మండలం మద్దూరు గ్రామానికి చెందిన ఇటుకల కిరణ్(19) అతని స్నేహితుడు నరేశ్‌తో కలిసి ఈ నెల 18న బైక్ (టీజీ11ఏ1788)పై బయలుదేరాడని, చేగూరు సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి ఫ్రీకాస్ట్ గోడకు ఢీకొందన్నారు. ఈ ప్రమదంలో తీవ్రంగా గాయపడ్డ కిరణ్, నరేష్‌ను చికిత్సకోసం ఉస్మానియాకు తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుని తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News