Sunday, August 17, 2025

ప్రసవించిన పదో తరగతి బాలిక

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాలికపై పక్కింటి వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడంతో పండంటి బిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బనగానపల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె ఇంటి పక్కన వరసకు చిన్నాన్న అనే యువకుడు మనోహర్ ఉన్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. బాలికు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News