నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 3’.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మే1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజే ఏకంగా రూ.43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి.. నాని కెరీర్ ను అత్యధిక వసూల్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు వందకోట్ల క్లబ్ లోకి ఎంటరైందీ సినిమా. నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లోనూ ఈ మూవీ అదరగొడుతోంది. ఇప్పటికే అక్కడ వన్ మిలియన్ మార్క్ దాటి 2 మిలియన్ల వైపు పరుగులు పెడుతోంది.
కాగా, డైరెక్టర్ శైలేష్ రూపొందించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. నానికి ఇది మూడో వంద కోట్ల సినిమా. ఇప్పటివరకు దసరా, సరిపోదా శనివారం సినిమాలు వందకోట్ల కలెక్షన్స్ సాధించాయి. హిట్ 3 తర్వాత నాని పారడైస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.