‘90s బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్, శివానీ నాగరం హీరోహీరోయిన్ గా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తోపాటు ఫ్యామిలీ ఆడియోన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మౌళి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇక, హీరోయిన్ శివానీ కూడా బాగా నటించింది.
ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది ‘లిటిల్ హార్ట్స్’. హౌస్ ఫుల్ షోలతో కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. ఈ క్రమంలో హీరో నాని ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమా చూసిన నాని.. మేకర్స్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని తెలిపారు. కాగా, ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో నిర్మించిన ఈ మూవీని డైరెక్టర్ సాయి మార్తాండ్ తెరకెక్కించాడు. ‘90s బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించగా.. నిర్మాత బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు.
Also Read: షారుక్ తనయుడి దర్శకత్వంలో రాజమౌళి.. ట్రైలర్ చూసేయండి..