హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ సుందరకాండ. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ “మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాను చూడొచ్చు. సినిమా మొదలైనప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాం. వినాయక చవితికి ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది”అని అన్నారు. డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ “ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. నా తొలి సినిమా వినాయక చవితి పండగ రోజు విడుదల కావడం ఆనందంగా ఉంది”అని తెలిపారు. నిర్మాత సంతోష్ మాట్లాడుతూ “సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్, డాక్టర్ నరేష్ వికె, వాసుకి తదితరులు పాల్గొన్నారు.
మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సుందరకాండ’
- Advertisement -
- Advertisement -
- Advertisement -