Friday, May 30, 2025

‘ఒజి’లో నారా రోహిత్‌కు కాబోయే భార్య.. హీరో ఏమన్నారంటే..

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్, ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ఒజి‘ (OG) ఒకటి. సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టార్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరో నారా రోహిత్‌కు (Nara Rohith) కాబోయే భార్య శిరీషా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ వార్తలు వాస్తవం అని రోహిత్ కన్ఫమ్ చేశారు. నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘భైరవం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా టీంని హీరో సాయి దుర్గా తేజ్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా ‘ఒజి’ (OG) అప్‌డేట్ ఇవ్వాలని రోహిత్‌ని తేజ్ అడగగా.. అందులో తనకు కాబోయే భార్య శిరీషాకు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కిందని వెల్లడించారు. అయితే ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని మంచు మనోజ్.. రోహిత్‌ని ఆటపట్టించారు. కాగా, భైరవం సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News