హీరో నారా రోహిత్ తన మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులని అలరించింది. బ్యాచిలర్ గా రోహిత్ పాత్రని చూపించిన విధానం అందరికీ నచ్చింది. శుక్రవారం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు.
సుందరకాండ ఆగస్టు 27న గణేష్ చతుర్థి రోజున థియేటర్లలోకి వస్తుంది. బుధవారం విడుదలతో ఈ చిత్రంకు లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. రిలీజ్ డేట్ పోస్టర్ నారా రోహిత్ జీవితంలోని వివిధ దశలలోని రెండు ప్రేమకథలను చూపిస్తోంది. ఇందులో ఒకటి శ్రీదేవి విజయ్ కుమార్ తో కలిసి మొదటి ప్రేమలోని అమాయకత్వాన్ని చూపించగా, మరొకటి వృతి వాఘానితో కలిసి సెకండ్ లవ్ ఛాన్స్ ని సూచిస్తుంది. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.