Saturday, September 6, 2025

వినాయక నిమజ్జనంలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో..

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: రాష్ట్రవ్యాప్తంగా శనివారం వినాయ నిమజ్జనం వేడుక ఘనంగా సాగుతోంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఆ గణపతిని కోలాహలంగా గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు. అయితే కొన్ని చోట్ల మాత్రం విషాదఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే నారాయణపేట (Narayanpet) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనంలో విషాదకర ఘటన జరిగింది. నారాయణపేట మున్సిపాలిటీలో పని చేస్తున్న శేఖర్(45) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. నిమజ్జన ఉత్సవాల్లో శేఖర్ డ్యాన్స్ చేస్తూ పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు అతడికి సిపిఆర్ చేసి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే శేఖర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Also Read : సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News