Tuesday, September 9, 2025

నారాయణపేట్-కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం: కాంగ్రేస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాల ప్రజల జీవనాదారమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానస పుత్రిక నారాయణపేట్-కొడంగల్ ఎత్తి పోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని కాంగ్రేస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం రోజు నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కాంగ్రేస్ నాయకులు మాట్లాడారు. ఈ సందర్బంగా వారు సాగునీరు లేక వర్షాదార పంటలే దిక్కుగా నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాలు బీడువారి ఎడారిగా మారిపోయాయన్నారు. వర్షాలు కురవక పొలాలు బీళ్ళుగా మారి దిక్కు తోచని స్థితిలో ఆయా నియోజకవర్గాల ప్రజలు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళి జీవనం వెళ్ళబుచ్చుకున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో నియోజకవర్గాల ప్రజల దుస్థితిని కళ్ళారా చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంబించారన్నారు.

కాని ప్రాజెక్టు నిర్మాణంతో తాము ఉనికి కోల్పోతామనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎవ్వరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుయుక్తులు పిన్నినా ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు నిర్మాణంతో రెండు నియెజకవర్గాల ప్రజల కళ్ళల్లో కాంతి నింపడమే లక్షంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్బంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ తాలూకా యువజన కాంగ్రేస్ అద్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, సీనియర్ నాయకులు ప్రమోద్‌రావ్, నర్సప్ప, లింగప్ప, మాధవరెడ్డి, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News