Wednesday, September 10, 2025

రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ మనిహారిక

- Advertisement -
- Advertisement -

నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో టౌన్ ప్లానింగ్ అధికారి మనిహారిక రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తి కి చెందిన ప్లాట్ ఎల్ ఆర్ఎస్ ప్రొసీడింగ్ కోసం రూ 10 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో వినోద్ మంగళవారం అడ్వాన్స్ గా మనిహారిక కు రూ 4 లక్షలు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టౌన్ ప్లాన్ అధికారిని అదుపులోకి తీసుకొని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News