Thursday, July 17, 2025

లాస్ ఎంజెలెస్‌లో వలసచిచ్చు

- Advertisement -
- Advertisement -

అమెరికాలో వలసదారులపై అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం పలు ప్రాంతాలలో నిరసనలకు, ఉద్రిక్తతకు దారితీస్తోంది. తమను బలవంతంగా బయటకు తరలించే యత్నాలను అమెరికాలోని ప్రఖ్యాత నగరం లాస్ ఏంజెలిస్‌లో ఉన్న వలసదారులు తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి (ఐసిఇ) చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమన్నాయి. అయితే తాము అనుకున్న విధంగా వలసదారులను బయటకు పంపించి తీరుతామని ట్రంప్ పట్టుపట్టారు. ఈ క్రమంలోనే ఈ నగరానికి వందలాది మంది నేషనల్ గార్డ్ చేరుకున్నారు. నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దింపడం అమెరికాలో అసాధారణ చర్య అయింది. వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి చేరుకున్నారు. గార్డ్‌కు ఎదురుగా నిలబడి , తమను బయటకు పంపించడం కుదరదని స్పష్టం చేస్తున్నారు.

నిరసనకారులు పలు ప్రాంతాలలో ప్రధాన రహదారులను దిగ్బంధించడం, కార్లను నడుపుతూ వాటికి నిప్పుపెట్టడం వంటి చర్యలతో ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై ఎక్కడ కూడా జనం గుంపుగా కనబడరాదని, అతిక్రిమిస్తే ఇది చట్ట విరుద్ధం అవుతుంది. తగు విధంగా చర్యలకు దిగుతారని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాలలో నిరసనకారులు పోలీసులపైకి పలు రకాల వస్తువులను విసిరారు. రాళ్లు రప్పలతో దాడికి యత్నించారు. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారుల వాహనాలపై బాణసంచాలను పేల్చారు. దక్షిణ ప్రాంతానికి దారితీసే 101 ఫ్రీవేను మూసివేశారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరకాలోని ఇతర ప్రాంతాల వలసదారులు కూడా ట్రంప్ అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా వీధుల్లో గుమికూడుతున్నారు. కాలిఫోర్నియా స్థానిక పోలీసులను పరిగణనలోకి తీసుకోకుండా ట్రంప్ దాదాపు రెండు వేల మంది నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దింపడం దారుణం అని లాస్ ఏంజెలిస్ గవర్నర్ గావిన్ న్యూసమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వలసదారులతోనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయనే ట్రంప్ వాదన సరికాదని, ఇతరత్రా రాజకీయ కారణాలతోనే ఇక్కడి వ్యవహారాలలో ఆయన నేరుగా తలదూరుస్తున్నారని గవర్నర్ మండిపడ్డారు. ఇక్కడి శివార్లలోని పారామౌంట్ పట్టణంలో కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాలో ఎక్కడ అరాచక పరిస్థితి ఏర్పడ్డా , ఏర్పడే అవకాశం ఉన్నా ఎమర్జెన్సీ విధింపు, అవసరం అయితే సైన్యాన్నిదింపడం జరుగుతుందని ప్రెసిడెంట్ ట్రంప్ , రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. లాస్ ఏంజెలెస్ గవర్నర్ ప్రతిపక్ష డెమోక్రాట్ కావడంతో ఇప్పుడు ఇక్కడ రాజకీయ వైరం తలెత్తుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News