Saturday, August 2, 2025

16 నుంచి స్కూల్ వాలీబాల్ లీగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచి వాలీబాల్‌ను (Volleyball) అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి స్కూల్ వాలీబాల్ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ లీగ్ జరుగనుంది. ఐదు వారాల పాటు జరిగే లీగ్‌లో మొత్తం 50 జట్లు పోటీపడనున్నాయి. ఇందులో బాలుర విభాగంలో 32,బాలికల విభాగంలో 18 జట్లు బరిలోకి దిగనున్నాయి. దేశంలో లీగ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న తొలి వాలీబాల్ లీగ్ (Volleyball league) ఇదే కావడం విశేషం. ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్, వర్శిటీ స్పోర్ట్ సంస్థతో కలిసి ఈ లీగ్‌ను నిర్వహించనుంది. టోర్నమెంట్ వివరాలను హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు యజమాని కణకాల అభిషేక్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. పిల్లలను వాలీబాల్ క్రీడా వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నట్టు వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, పూర్తి ప్రొఫెషనల్ విధానంలో లీగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News