- Advertisement -
మన తెలంగాణ/నిజామాబాద్ స్పోర్ట్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాటర్ పోలో ఎంపికలలో జిల్లాకు చెందిన స్విమ్మర్ తేజస్ మరియు శ్రీ అఖిల్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైనా క్రీడాకారులు ఆగస్టు 4 నుండి బెంగళూరులో జరిగే 51 జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని అన్నారు. ఎంపికైనా క్రీడాకారులను జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గడీల శ్రీరాములు, డాక్టర్ కైసార్, సుశీల, నిషిత రాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మినారాయణ, వేణుగోపాల్, సంజీవ్ తదితరులు అభినందించారు.
- Advertisement -