Thursday, September 11, 2025

రష్యా డ్రోన్లను కూల్చివేసిన నాటో దేశం

- Advertisement -
- Advertisement -

వార్సా : ఎలాంటి అనుమతి లేకుండా పోలండ్ గగనతలం లోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను పోలండ్ ముందు జాగ్రత్తగా కూల్చి వేసింది. నాటో సభ్య దేశం లోకి డ్రోన్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గగనతలం లోకి డ్రోన్లు ప్రవేశించడంపై నాటో సెక్రటరీ జనరల్‌కు సమాచారం ఇచ్చామని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పారు. ఈ సందర్భంగా టస్క్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలండ్ నాలుగు విమానాశ్రయాలను మూసివేసింది. రష్యా డ్రోన్లు పోలండ్ గగనతలం లోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ ముందుగా హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News