Thursday, July 17, 2025

రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‌పై 100 శాతం సుంకం: నాటో హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడింది. ఈ క్రమంలో మాస్కో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం సుంకం విధిస్తామని భారత్‌తో సహా చైనా దేశాలను నాటో హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె అమెరికా సెనెటర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని , బ్రెజిల్ అధ్యక్షుడు, ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం.

ఆయా దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం. మాస్కో లోని ఆ వ్యక్తి (పుతిన్‌ను ఉద్దేశిస్తూ) శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మా పరిణామాలు ఈ దేశాలనూ తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి పుతిన్‌కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురండి. లేకుంటే మూడు దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతాయి.” అని హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడుట్రంప్ ఉక్రెయిన్‌కు ఎయిర్‌డిఫెన్స్‌లు మాత్రమే కాకుండా క్షిపణులు భారీగా సరఫరా చేయనున్నారని వెల్లడించారు. ఇక రష్యాపై ట్రంప్ తీసుకుంటున్న చర్యలను యూఎస్ రిపబ్లికన్ సెనేటర్‌థామ్ టిల్లిస్ ప్రశంసించారు.

కానీ 50 రోజుల వరకు సమయం ఇవ్వడం తనను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఈ సమయంలో పుతిన్ యుద్ధంలో గెలవడానికి ప్రయత్నిస్తారన్నారు. హత్యలు చేసి, మరింత భూభాగాన్ని కాజేసి, ఆ తర్వాత శాంతి చర్చలకు వచ్చేందుకు ముందుకొస్తారన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు వ్యవహారంలో రష్యా వైఖరిపై ట్రంప్ సీరియస్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధిస్తామని మాస్కోను హెచ్చరించారు. అయితే ఈ బెదిరింపులను రష్యా కొట్టి పారేసింది. అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News