Wednesday, July 16, 2025

అనుమానంతో ఇద్దరు టీచర్లను చంపిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

బీజాపూర్ : పోలీస్ ఇన్‌ఫార్మర్లు అన్న అనుమానంతో ఇద్దరు టీచర్లను నక్సల్స్ హత్య చేశారు. ఆ టీచర్లు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక విజిటింగ్ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరు పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా అనుమానించి వారిని వేర్వేరు ప్రదేశాల్లో చంపారని అధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ టీచర్లను బీజాపూర్ జిల్లాలోని చాలా లోపలికి తీసుకెళ్లి నక్సల్స్ చంపారు.

మృతుల్లో వినోద్ మాడే (28), ఫార్‌సెగడ్ ఏరియా పిల్లూరు గ్రామానికి చెందినవాడు కాగా, మరోవ్యక్తి సురేష్ మెట్టా (29) టేకమెట గ్రామానికి చెందిన వాడు. వినోద్ కొడపగడు గ్రామం స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నాడు. సురేష్ టెకమెట గ్రామంలోనే స్కూలులో పనిచేస్తున్నాడు. చాలా లోపలి ప్రాంతమైన ఇంద్రావతి నేషనల్ పార్కు ఏరియాలో ఈ సంఘటన జరిగిందని, మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఈ సంఘటనతో బస్తరు రీజియన్‌లో ఈ ఏడాదిలో ఇంతవరకు 25 మంది నక్సల్స్‌కు బలయ్యారు. బీజాపూర్ పమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 21న ఇద్దరు గ్రామస్తులను నక్సల్స్ హత్య చేశారు. జూన్ 17న ముగ్గురు గ్రామస్థులు నక్సల్స్‌కు బలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News