- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో #మెగా157 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ మీడియోను వదిలారు.
“అన్న.. చిరంజీవి గారి పాట!!.. కొంచెం సౌండ్ పెంచు. హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమా” అంటూ నయనతార చెప్పిన డైలాగ్స్ తోపాటు వీడియో చివరలో “సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం” అంటూ నయన్, అనిల్.. మెగాస్టార్ చిరు స్టైల్లో చెప్పడం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేకర్స్.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
- Advertisement -