కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో విడిపోతున్నట్లు గత కొన్నిరోజులు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నయన్ విడాకులపై కోలీవుడ్ మీడియాలో, నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడతున్నాయి. ఈ క్రమంలో రూమర్స్ కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు నయన్. తాజాగా వీటిపై స్పందించిన ఆమె.. ఒకే ఒక పోస్ట్ తో వాటికి చెక్ పెట్టారు. ‘మా గురించి వచ్చే సిల్లీ న్యూస్ చూస్తే.. మా రియాక్షన్ ఇదీ’ అంటూ తన భర్త విఘ్నేష్ తో దిగిన ఓ ఫొటో ఇన్ స్టా స్టోరి పెట్టి.. రూమర్స్ కు గట్టిగానే ఇచ్చిపడేశారు.
కాగా, కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయన్.. నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రెండుసార్లు ప్రేమలో విఫలమైన ఆమె.. మూడోసారి మాత్రం ఇష్టపడిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ విఘ్నేష్ తెరకెక్కించిన ఓ మూవీలో నటించిన నయన్.. ఆ సమయంలోనే అతన్ని ఇష్టపడినట్లు చెప్పింది. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు కలిసి తిరిగిన ఈ జంట.. చివరికి సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా నయన్ దంపతులకు ఇద్దరు కవల మగ పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే.
ఇక, సినిమాల విషయానికి వస్తే.. నయనతార చాలా ఏళ్ల తర్వాత మరోసారి తెలుగులో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె, మెగాస్టార చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాస్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీలోనూ నయన్ యాక్ట్ చేస్తున్నారు.