Thursday, May 15, 2025

మెగాస్టార్‌కు జోడీగా…

- Advertisement -
- Advertisement -

సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్న నయనతార చాలా కాలంగా ఎంతో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సొంతం చేసుకుంది. పలు సక్ఫెస్‌ఫుల్ సినిమాలు, మంచి ట్రాక్ రికార్డుతో నయనతార కమర్షియల్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. పెళ్లి అయినప్పటికీ నయన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మునుపటి లానే సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తోంది.

ఇక చాలా గ్యాప్ తర్వాత ఆమె ఒక తెలుగు సినిమా ఒప్పుకొంది. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఈ భామ నటించనుంది. జూన్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. నయనతార కూడా అదే టైంలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందే ఈ సినిమాలో చిరంజీవి హీరో, వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. క్యాథరిన్ ట్రెసా మరో హీరోయిన్. ఇక ఈ సినిమా కోసం నయనతార తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుందని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News