Monday, May 26, 2025

అజేయ సైనిక శక్తి, అపార మోడీ యుక్తి

- Advertisement -
- Advertisement -

ఎన్‌డిఎ కీలక సమావేశంలో తీర్మానం
ఆపరేషన్ సిందూర కీలకమని ప్రశంస
ప్రధాని సముచిత నిర్ధేశక విజయమని వెల్లడి

న్యూఢిల్లీ : దేశ సాయుధ త్రివిధ సైనిక బలగాల శక్తి సామర్థాలను , ప్రధాని మోడీ నాయకత్వ పటిమను బిజెపి సారధ్య ఎన్‌డిఎ (NDA Meeting ) కొనియాడింది. ఈ మేరకు ఆదివారం ఇక్కడ జరిగిన ఎన్‌డిఎ విస్తృత సమావేశంలో తీర్మానం వెలువరించారు. ఈ సమావేశంలో ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ఉప ముఖ్యమంత్రులు ఇతర నేతలు పాల్గొన్నారు. పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సిందూర దశలో భారతీయ సైన్యం కనబర్చిన ధైర్యసాహసాలను ఈ సందర్భంగా భేటీలో ప్రస్తుతించారు. సకాలంలో సరైన మార్గ నిర్ధేశనంతో , అంతకు మించిన జాతీయ సమన్వయంతో ప్రధాని మోడీ తమ నాయకత్వ లక్షణాలను కనబర్చారని పేర్కొంటూ తీర్మానం ఆమోదించారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ప్రతిపాదిత తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ బలపర్చారు. భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని , మనో నిబ్బరాన్ని ఆపరేషన్ సిందూర మరో మారు సుస్పష్టం చేసిందని ఈ తీర్మానంలో తెలిపారు. క్లిష్ట పరిస్థితుల సమయంలో ప్రధాని మోడీ సమర్ధవంతంగా వ్యవహరించారని నేతలు కితాబు ఇచ్చారు. ప్రధాని మోడీ ఎప్పుడూ సైనిక బలగాలను వెన్నుతడుతూ వచ్చారు. ఉగ్రవాదంపై పోరులో సైన్యం నిర్ణాయాత్మక చర్యలకు కేంద్రం మద్దతు ఇచ్చింది తరువాతి క్రమంలో చేపట్టిన ఆపరేషన్ సిందూరతో ఉగ్రవాదులకు వారి ప్రేరకులకు , తెరవెనుక మద్దతుదార్లకు ధీటైన చెంపచెళ్లు జవాబు ఇచ్చారని తెలిపారు.

ఈ ఒక్కరోజు సమావేశానికి దాదాపుగా 19 మంది ముఖ్యమంత్రులు , ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో (NDA Meeting ) హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జెపి నడ్డా తమ బిజెపి అధ్యక్ష బాధ్యతలతో తరలివచ్చారు. ముందుగా ఆపరేషన్ సిందూర ప్రస్తావన తరువాతి దశలో పలు జాతీయ రాజకీయ విషయాలు చర్చకు వచ్చాయని బిజెపి వర్గాలు ఆ తరువాత మీడియాకు తెలిపాయి. కులగణన, సుపరిపాలన, మూడో దఫా అధికారంలో మోడీ ప్రభుత్వం ఏడాది పాలన వంటి విషయాలు కూడా అజెండాలో చేరాయి. రాష్ట్రాలలో సుపరిపాలనా విధానాల రూపకల్పన , కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం గురించి కూడా చర్చ జరిగింది. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News