Tuesday, July 8, 2025

సిగాచీ ఘటన: పరిశ్రమ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ బృందం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం (Sigachi Blast) జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పరిశ్రమని నేషనల్ డిజాస్టర్ మేనేజ‌్‌మెంట్ అథారిటీ(ఎన్‌డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ ప్రశ్నల వర్షం కురిపించింది. యాజమాన్యం సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ అధికారుల స్పందనపై బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. రసాయన పరిశ్రమ గురించి తమకు తెలుసని, పేలుడు ఎలా సంభవించిందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకూ 44 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News