Friday, May 16, 2025

కాళేశ్వరంపై ఎన్‌డిఎ నివేదిక అధ్యయనానికి ఐదుగురితో కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రా జెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్‌డిఎస్‌ఎ) నివేదికను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలపై నే షనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్‌డిఎస్‌ఎ) నివేది క అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటిని ఏర్పాటుచేసింది. ఈమేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధ్యయన కమిటిలో నీటిపారుదలశాఖ ఈఎన్‌సి(జనరల్), ఈఎన్‌సి(ఒఅండ్‌ఎం), రామగుండం చీఫ్ ఇంజినీర్, చీఫ్ ఇంజినీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, చీఫ్ ఇంజినీర్ క్వాలిటీ కంట్రోల్ ఉన్నారు. కమి టిలోని ఈ ఐదుగురు అధికారులు స్వయంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలను సం దర్శించి నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్యారేజిల పరిరక్షణ, స్ట్రక్చరల్ ఇంటిగ్రిటిలను ప్రత్యేకంగా పరిశీలించాలని, సమగ్రంగా అధ్యయన నివేదికను ప్రభుత్వానికి అందించాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News