గాంధీనగర్: నీట్ పరీక్షలో ఉత్తీర్ణురాలైన యువతి పరువు హత్యకు గురైన సంఘటన గుజరాత్ రాష్ట్రం బనాస్‌కాంటా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంద్రిక అనే యువతి పాలన్‌పుర ప్రాంతంలో నీట్ కోచింగ్ తీసుకుంది. అక్కడి హాస్ట్‌లో చదువుకుంటూ ఉండేది. హరేశ్ చౌదరి అనే వివాహితుడితో చంద్రిక ప్రేమలో పడింది. అతడితో సహజీవనం కూడా చేసింది. ఈ విషయంలో ఇంట్లో వాళ్లకు తెలియడంతో యువతిని కట్టడి చేశారు. అదే సమయంలో పాత హరేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
జూన్ 21న హరేశ్ విడుదలై తన ప్రియురాలు చంద్రిక వెతికాడు.ఆమె ఆచూకీ లేకపోవడంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు జూన్ 27న విచారణ జరగనుండగా 24న చంద్రిక చనిపోయింది. 25న కుటుంబ సభ్యులు హడావుడిగా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. వివాహితుడితో ప్రేమాయణం నడిపించడంతో పాలలో నిద్రమాత్రలు కలిపి చంద్రికకు తాగించారు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో తండ్రి, ఇద్దరు బాబాయిలు కలిసి చంపినట్టు తేలింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.