- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని రూమ్ కు పిలిచుకొని ప్రియుడు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిఖిల్ అనే యువకుడు ప్రేమించిన యువతి మైథిలిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లెలు సాహితికి ఫోన్ చేసి గొడవ జరగడంతోనే చంపేశానని తెలిపాడు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో నిందితుడు నిఖిల్ లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైథిలి ప్రస్తుతం బీఫార్మసీ చదువుతున్నట్టు సమాచారం. ప్రేమకు నిరాకరించడంతోనే ఆమెను ప్రేమికుడు చంపేసినట్టు తెలుస్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -