రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించడమే కాదు, అతడి సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు నిండిగుంట అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్, కిలాడీ లేడీ అరుణపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అరుణపై క్రైం. నెం.: 246/2025 అండర్ సెక్షన్ 127(2), 140(3), 308(5), 115(2) r/w 3(5) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసుల అరుణతో పాటు మరో ముగ్గురిని ముద్దాయిలుగా చేర్చారు. ఎ 1-నిడిగుంట అరుణ, ఎ2- పల్లం వేణు, ఎ3- అంకెం రాజ, ఎ4- సీరం ఎలిష.. ఇలా నలుగురిని ఈ కేసులో ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. మునగ వెంకట మురళి కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని మురళీకృష్ణను కత్తితో బెదిరిం చినట్టు ఫిర్యాదు అందడంతో అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు కోర్టుకు తరలించారు.
మరోవైపు, రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రేయసి అరుణపై నెల్లూరు జిల్లా పోలీసులు దృష్టి పెట్టారు. ఓ బిల్డర్‌ని బెదిరించిన కేసులో అరుణతోపాటు మరో ముగ్గురు పై కేసు నమోదు చేసి విజయవాడ వెళ్తుండగా అద్దంకి సమీపంలో అరుణని కోవూరి పోలీసులు అరెస్టు చేశారు. అరుణ ఆగడాలు మితిమీరిపోయాయం టూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోవూరు పోలీసులను లాయర్ రాజారావు ఆశ్రయించారు. గతంలో అనేక ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ ప్రొటెక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చిన అరుణ.పోలీసులతో విస్తృతంగా పరిచయాలు పెంచుకుంది.. స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తుందనే ఆరోపణలు అరుణపై ఉన్నాయి. ఇక, జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీషీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇప్పించడంలో అరుణది కీలక పాత్రగా చెబుతున్నారు.
ఇక, అరుణ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కొక్కరు గా అరుణ బాధితులు బయటికి వస్తున్నారు. దాడులు దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు అరుణ తనపై కక్ష కట్టిందని లాయర్ రాజారావు పేర్కొన్నారు.. అరు ణ ఒసి అయితే ఎస్సి అని చెప్పుకుంటూ అందరిని బెదిరిస్తుందంటున్నారు.. ఇంటి ఓనర్ని బెదిరించి ఫ్లాట్‌ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునేం దుకు అరుణ ప్రయత్నించింది.. అరుణ చేస్తున్న అరాచకాలను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు నోటీసుల రూపంలో పంపాను. అరుణను కఠినం గా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని లాయర్ రాజారావు అంటున్నారు.