Tuesday, September 16, 2025

కథని నమ్మితేనే ఇలాంటి సినిమాలు చేయగలుగుతాం..

- Advertisement -
- Advertisement -

తొలి సినిమా ’స్వాతిముత్యం’తో ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ’నేను స్టూడెంట్ సర్’తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో దర్శకుడు వివి వినాయక్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. “టీజర్ చాలా బావుంది. ఈ సినిమాతో గణేష్ కి మరో విజయం రావాలని కోరుకుంటున్నాను. అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతోంది.. వాళ్ళ అమ్మ భాగ్యశ్రీలానే అవంతిక కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ “కథని బలంగా నమ్మితేనే ఇలాంటి సినిమాలు చేయగలుగుతాం. రాఖీ ఉప్పలపాటి లాంటి అంకిత భావంతో పని చేసే దర్శకుడు దొరకడం మా అదృష్టం. అవంతిక దస్సాని చాలా చక్కగా నటించింది” అని చెప్పారు.

నిర్మాత ‘నాంది’ సతీష్ వర్మ మాట్లాడుతూ “టీజర్ ఎంత ఆసక్తికరంగా ఉందో సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ముందుముందు కూడా మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అవంతిక దస్సాని, దర్శకుడు రాఖీ ఉప్పలపాటి, కృష్ణ చైతన్య, జెమినీ సురేష్, రవి శివతేజ, శశి, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు పాల్గొన్నారు.

‘Nenu Student Sir’ Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News