ప్రస్తుతం నేపాల్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అసంతృప్తితో రాచరిక పాలనకు అనుకూల డిమాండ్ పుంజుకోవడం, రాజకీయ అస్థిరత, సామాజిక, ఆర్థిక సవాళ్లు, ప్రాంతీయ అసమానతల నేపథ్యంలో సంక్లిష్టమైన అంశమే. నేపాల్ దేశంలో పరిస్థితులు, భారతదేశం, చైనాతో దాని భౌగోళిక, రాజకీయ సంబంధాలు, భారతదేశంలో నేపాలీ మాట్లాడే జనాభాతో సంబంధాలు, దేశ భవిష్యత్ పథంలో సంభవాలు వంటి ముఖ్యఅంశాలను ఈ వ్యాసం లో ప్రస్తావిస్తున్నాం. ప్రజాస్వామ్య అస్థిరత మధ్య రాచరికం కోసం డిమాండ్ దాదాపు 240 ఏళ్లపాటు నేపాల్‌లో రాచరిక పాలన సాగింది. 2008లో రాచరిక పాలన రద్దు చేసినప్పటి నుంచి, ఆ దేశం స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించుకోవడానికి చాలా కష్టపడుతోంది. ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ 17 సంవత్సరాలలో 13 ప్రభుత్వాలను చూసింది. ఏ ప్రభుత్వం కూడా పూర్తి పదవీకాలం సాగలేదు.
ఇది రాజకీయ అస్తవ్యస్త పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. రాజకీయ అనుకూల ఉద్యమానికి దోహదం చేస్తున్న పలు అంశాలలో రాజకీయ అస్థిరత, అవినీతి, తరచు ప్రభుత్వాలు మారడం, హంగ్ పార్లమెంట్, తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణల కారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకం సడలిపోయింది. ఉదాహరణకు 2022లో హంగ్ పార్లమెంటు ఏర్పడింది. ఫలితంగా నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, నేపాల్ కాంగ్రెస్ వంటి పార్టీల నేతృత్వం లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు సుస్థిరమైన పాలన అందించలేకపోయాయి.ఆర్థికపరమైన సవాళ్లు అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక సంరక్షణ, విద్య వంటి రంగాలలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ వహించకపోవడం, ప్రజలలో తీవ్ర అసంతృప్తిని నిరాశా, నిసృ్పహలను పెంచాయి. నిరసనలు పెరిగాయి. రాజేంద్రకున్వర్ వంటి చాలా మంది నేపాలీలు రాచరికానికి మద్దతు ఇవ్వడానికి పలు కారణాలను చూపుతున్నారు. ఒకనాటి రాచరిక వ్యవస్థతను స్థిరత్వానికి చిహ్నంగా చూస్తారు.
హిందూ గుర్తింపు, జాతీయవాదం ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా నేపాల్ గుర్తింపు పొందింది. చరిత్రాత్మకంగా సాగిన రాచరిక పాలనతో ఈ గుర్తింపు వచ్చింది. రాజులను విష్ణువు అవతారాలుగా భావించేవారు. 2008లో నేపాల్ లౌకిక గణతంత్ర రాజ్యంగా మారడంతో క్రైస్తవ మత మార్పుడులు పెరిగాయి. 2001 నాటికి 0.45 శాతంగా ఉన్న మతమార్పిడులు 2021 నాటికి 1.76 శాతానికి పెరిగాయి. దీనికి తోడు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పిపి) వంటి రైట్‌వింగ్ పార్టీలు హిందూ జాతీయవాద భావాలను మరింత రేకెత్తిస్తున్నాయి. రాచరిక అనుకూల నిరసనలు 2025 మార్చి నుంచి మాజీ మావోయిస్ట్ గెరిల్లా దుర్గా ప్రసాయి వంటివారు ఆర్‌పిపి వంటి పార్టీల నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు సాగాయి. మాజీ రాజు జ్ఞానేంద్ర షాను తిరిగి రాజుగా ప్రతిష్టించి, నేపాల్‌ను హిందూ రాష్ట్రంగా పునరుద్ధరించాలని డిమాండ్ వచ్చింది.
ఖట్మండూలో పది వేల నుంచి 15 వేల మంది మద్దతుదారులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. 2025 మార్చి 28 ఈహింసాకాండకు ఇద్దరు బలయ్యారు. రాష్ట్రీయ ప్రజాస్వామ్య పార్టీ 2022లో 275 మంది ఉన్న జాతీయ సభలో కేవలం 14 సీట్లు పొందింది. 5.5 శాతం ఓట్లు సాధించింది. అయినా ప్రజలలో రేకెత్తిన అసంతృప్తిని ఉపయోగించుకుని కేవలం రాచరికంతో కూడిన రాజ్యాంగమే దేశాన్ని సుస్థిరంగా ఏకంగా ఉంచగలదని వాదిస్తోంది. అయితే 95% ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపాల్ కాంగ్రెస్, యుఎంఎల్, మావోయిస్ట్ సెంటర్ వంటి ప్రధాన పార్టీలు ఆ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా రాచరికానికి మద్దతు నామమాత్రంగా మారింది. నేపాల్ భారతదేశం అనుబంధం, నేపాల్ భారతదేశం మధ్య లోతైన చారిత్రక, సాంసృ్కతిక, ఆర్థిక సంబంధాలు నెలకొన్నాయి.
దీనిని తరచు – రోటీ- బేటీ (ఆహారం, వివాహం) అనుబంధంగా వర్ణిస్తారు. ఉభయదేశాల మధ్య 1,850 కిలోమీటర్ల పొడవైన బహిరంగ సరిహద్దు ఉంది. 1950లో భారత నేపాల్ మధ్య శాంతి, స్నేహ ఒప్పందంతో ఈ అనుబంధం మరింత బలోపేతం అయింది. నేపాల్ హిందూ గుర్తింపు భారత దేశంతో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, (బిజెపి) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వంటి హిందూ జాతీయవాద సమూహాలతో ప్రతిధ్వనిస్తున్నది. బిజెపి నాయకుడు, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌నాథ్ పీఠంతో షా రాజవంశం అనుబంధం కారణంగా నేపాల్‌లో రాచరిక అనుకూల ఉద్యమానికి భారతదేశం మద్దతు ఇస్తోందనే ఊహాగానాలకు ఆజ్యంపోసింది. భారతదేశం మాత్రం అధికారికంగా నేపాల్ ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యానికే మద్దతు ఇస్తున్నది.
రాజకీయ సున్నితత్వం నేపాల్ రాచరిక అనుకూల ఉద్యమం భారతదేశంలో ఆందోళనలను రేకెత్తించింది. ముఖ్యంగా ఆదిత్యనాథ్ రాజవంశవాదులకు మద్దతు ఇస్తున్నారని ప్రధాని కెపి శర్మ ఓలి ఆరోపణ తర్వాత ఇది మరీ హెచ్చింది. భారతదేశంలోని గౌహతిలో 2025 ఏప్రిల్ 1న ఒక రాజవంశ నాయకుడిని అరెస్ట్ చేశారు. అతడిని అప్పగింత సమస్య నివారించాలని కోరడంతో సరిహద్దు ఉద్రిక్తతలను పెంచింది. మరో పక్క చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నేపాల్‌లో స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తూ భారతదేశం ఆచీతూచీ వ్యవహరిస్తోంది. చైనా ప్రభావం- నేపాల్ లో చైనా ప్రభావం పెరుగుతుండడం భారతదేశానికి వ్యూహాత్మక ప్రతిఘటనగా నిలుస్తోంది. ఇది భౌగోళిక రాజకీయ శత్రుత్వం, నేపాల్ ఆర్థిక అవసరాల నేపథ్యంలో రూపొందింది. చైనా నేపాల్‌లో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బిఆర్‌ఐ) కింద పలు ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టింది. రైల్వేలు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చింది. ఉదాహరణకు భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసినా, 2024లో బిఆర్‌ఐ కింద రైల్వే ప్రాజెక్టును నేపాల్ ఆమోదించింది.
చైనా నేపాల్‌లో స్కాలర్ షిప్‌లనూ అందిస్తోంది. అలాగే నేపాల్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తూ ప్రజల మధ్య సంబంధాలనూ పెంపొందిస్తోంది. చరిత్రాత్మకంగా నేపాల్ రాజులు ముఖ్యంగా మహేంద్ర, బీరేంద్ర, జ్ఞానేంద్రలు భారతదేశం ఆధిపత్యాన్ని బ్యాలెన్స్ చేసేందుకు చైనా వైపు మొగ్గు చూపారు. నేడు చైనా నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీలకు, ముఖ్యంగా తన పట్టును నిలుపుకునేందుకు ఓలికి చెందిన యుఎంఎల్ పార్టీకి మద్దతు ఇస్తోంది. రాచరికం తిరిగి రావడాన్ని చైనా వ్యతిరేకిస్తోందని సోషల్ మీడియా ఎక్స్‌లోనూ ప్రచారం సాగిస్తోంది. గుర్తింపు – రాజకీయాలు భారతదేశంలో నేపాలీ మాట్లాడే జనాభాను తరచుగా భారతీయ గూర్ఖాలు అని పిలుస్తారు. వారి సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, అసోంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేపాల్‌తో సాంసృ్కతిక, రాజకీయ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. భారతీయ గూర్ఖాలు నేపాలీ పౌరుల నుంచి తమను తాము వేరుగా చూసుకుంటారు.
వలసదారులు అనే భావనను ఎదుర్కొనేందుకు భారతీయ మూలాలు గుర్తుచేస్తారు. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ డార్జిలింగ్‌లో జరుగుతున్న గూర్ఖాలాండ్ ఉద్యమం వారి ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబిస్తుంది. అయితే, నేపాల్ హిందూ, రాచరిక సంప్రదాయాలనుంచి ప్రేరణ పొందింది.నేపాల్‌లో రాచరిక అనుకూల ఉద్యమం కొంది మంది భారతీయు గూర్ఖాలతో డార్జిలింగ్‌లో ప్రతిధ్వనిస్తుంది. అక్కడ హిందూ జాతీయవాద భావాలు నేపాల్‌ను హిందూ రాజ్యంగా పునరుద్ధరించాలనే విధంగా ఉన్నాయి. అయితే భారతీయ గూర్ఖాలు మాత్రం ఈ వాదనకు మద్దతు ఇస్తున్న దాఖలాలు లేవు. చాలా మంది నేపాలీలు ముఖ్యంగా పాతతరాలు రాచరికాన్ని స్థిరత్వం, అందించే, హిందూ సంప్రదాయాలను సమర్థించే ఏకీకృత శక్తిగా భావిస్తాయి. కాగా, జ్ఞానేంద్ర షా జాతీయ గౌరవాన్ని పునరుద్ధరించగలడని నమ్ముతూ, తీర్ బహదూర్ భండారీ వంటి నిరసనకారులు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంపట్ల భ్రమలు యువ నేపాలీలకు రాచరికంతో అనుబంధం తక్కువే అయినా, అవినీతి, ఆర్థిక ఇబ్బందులతో నిరాశ చెందుతున్నారు. వారు రాచరిక పునరుజ్జీవనానికి మద్దతు ఇచ్చే అవకాశం తక్కువ.
సంస్కరణలు లేదా అచారబద్ధమైన రాచరికాన్ని ఇష్టపడే అవకాశం ఉంది. క్రైస్తవ మతమార్పిడులు, లౌకిక విధానాలు పెచ్చు పెరగడంతో హిందూ పునరుజ్జీవనను భావనను రేకెత్తించింది. రాజూ తిరిగి రండి, దేశాన్ని రక్షించండి వంటి నినాదాలలో మాత్రం హిందూ మతాన్ని రాష్ట్రమతంగా తిరిగి పొందాలనే డిమాండ్లతో స్పష్టమవుతోంది. జ్ఞానేంద్ర సందేహాలు 2005, -2006లో సాగిన జ్ఞానేంద్ర నిరంకుశపాలన, ఆయన కొడుకు పరాస్ వివాదాస్పద తీరు వల్ల వారిపట్ల ఆకర్షణ తగ్గింది. చాలామంది నేపాలీలు రాచరిక వ్యవస్థనను సమర్థించినా, మాజీ రాజు పట్ల జాగ్రత్తగా ఉంటారు. నేపాల్ భవిష్యత్‌ను అంచనా వేయడం అంటే, రాచరిక అనుకూల ఉద్యమం, బలపడిన గణతంత్ర వ్యవస్థ, భౌగోళిక రాజకీయ గతులను తూకం వేయడం. నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వాలు అవినీతి, ఆర్థిక ఇబ్బందులవల్ల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి.
అయినా 95% మంది ఓటర్లు మద్దతు గల పార్టీలు రాచరికంపై ప్రధాన పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ లేకుండా రాచరిక ఉద్ధరణ అసంభవం. అందుకు పార్లమెంటులో మూడింట రెండువంతుల మెజారిటీ కావాలి.అదీ అసాధ్యమే. ఆర్‌పిపి నాయకులతో సహా కొద్దిమంది రాచరికవాదులు, జపాన్, బ్రిటన్‌లో రాచరిక రాజ్యాంగం ఏకీకృత శక్తిగా వాదిస్తారు. ప్రజలలో భ్రమలు పెరిగితే, ఇది ప్రజాదరణ పొందవచ్చు. కానీ, దీనికి కమ్యూనిస్ట్, లౌకికశక్తులనుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. భౌగోళిక రాజకీయ సమతుల్య చట్టం నేపాల్ భారతదేశం, చైనా మధ్య తన స్థానాన్ని తటస్థంగా కొనసాగిస్తుంది. భారతీయ ఆర్థికపరపతి, సాంసృ్కతిక సంబంధాలు దానిని ఒక అంచున నిలుస్తాయి. చైనా బిఆర్‌ఐ పెట్టుబడులు, కమ్యూనిస్ట్ పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. సాంఘిక, ఆర్థిక సంస్కరణలు నేపాల్ సుస్థిరత సాధించాలం, అవినీతి నిర్మూలించాలి, పాలన మెరుగుపడాలి, ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి.
అలా చేయడంలో విఫలమైతే అశాంతి రేకెత్తుతుంది. రాచరికంకోసం జరుగుతున్న ఉద్యమాలు బలం పుంజుకుంటాయి. నేపాల్‌లో రాచరికం కోసం డిమాండ్.. అక్కడి ప్రజాస్వామ్య వైఫల్యాలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, హిందూ మతంలో సాంసృ్కతిక గుర్తింపు పొందాలన్న కోరికల పట్ల తీవ్ర అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, దుర్గా ప్రసాయి వంటి వ్యక్తులు రాచరిక భావాలను పెంచుకుంటున్నప్పటికీ, ప్రజలలోనూ, పార్లమెంటు మద్దతులో గణనీయమైన మార్పు ఉంటే తప్ప ప్రజాస్వామ్యాన్ని గణతంత్రాన్ని కూల్చివేసే పరిస్థితి ఈ రాజకీయ ఉద్యమాలకు లేదు. సుస్థిరమైన పాలన, భారత, చైనాల పోటీ ప్రయోజనాలను సమతుల్యం చేసే సామర్థ్యంపైనే నేపాల్ భవిష్యత్ ఆధారపడి ఉంది. భారతదేశంలో నేపాలీ మాట్లాడే సమాజాలు సాంసృ్కతిక కోణాన్ని జోడిస్తాయే తప్ప నేపాల్ రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం నేపాల్ ఓ క్రాస్ రోడ్‌లో ఉంది. రాచరికం తిరిగి రావాలన్న డిమాండ్ జనంలో అసంతృప్తికి గుర్తుగా ఉందే తప్ప. అది అసంభవమైన వాస్తవం.!
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) ( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)