పొరుగు దేశం నేపాల్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా జెన్-z పేరుతో రాజధాని ఖాట్మండులో ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలతోపాటు జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఖాట్మాండు సహా మరో పది పట్టణాల్లో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియాపై బ్యాన్ నేపాల్ ప్రభుత్వం విధించింది. దాదాపు 26 యాప్‌లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాన్ కు వ్యతిరేకంగా వందల సంఖ్యలో యువత రోడెక్కారు.
మరోవైపు, ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్‌లోకి దూసుకెళ్లారు. దీంతో నిరసనకారులను అడ్డుకునేందుకు నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో నిరసనకారులు సైనికులపై రాళ్ల విసురుతూ ఎదురు దాడి చేశారు. ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 300 మందికి పైగా గాయాపడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ సిద్ధం