- Advertisement -
ఖాట్మాండు: నేపాల్‌లో గత వారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెల్లుబికినప్పుడు వివిధ జైళ్ల నుంచి 3700కు పైగా ఖైదీలు తప్పించుకు పారిపోయారు. అయితే వారిని నేపాల్ పోలీసులు ఆదివారం తిరిగి అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 3723 ఖైదీలను తిరిగి జైళ్లకు తెచ్చామని నేపాల్ పోలీస్ ప్రతినిధి డిఐజి బినోద్ ఘిమిరే తెలిపారు. కాగా ఇప్పటికీ 10320 మంది ఖైదీలు పారారీలో ఉన్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా కొంత మంది ఖైదీలు స్వచ్ఛందంగా జైళ్లకు తిరిగొచ్చారు. మరికొందరు ఇండియాకు పారిపోడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -