Tuesday, September 9, 2025

ఆగని అల్లర్లు: నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా

- Advertisement -
- Advertisement -

కాఠ్‌మాండూ: నేపాల్‌లో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్‌మీడియా నిషేధంతో మొదలైన అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి (KP Sharma Oli) తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు పదవి నుంచి ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు సమాచారం. సోషల్‌మీడియాపై నిషేధం ఎత్తివేసినా నేపాల్‌లో ఆందోళనలు ఆగలేదు. వరుస ఆందోళనలతో పలువురు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలంటూ నేపాల్‌ యువత ఆందోళన చేపట్టారు. కాఠ్‌మాండూ సహా పలు జిల్లాల్లో భారీ ఎత్తున విద్యార్థులు ఆందోళణ చేపట్టారు. నేపాల్ మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపైనా ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో 20 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ప్రధాని (KP Sharma Oli) రాజీనామా చేయడంతో దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది.

Also Read : నేపాల్‌ రక్తసిక్తం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News