Saturday, August 2, 2025

నెవర్ సే గుడ్ బై

- Advertisement -
- Advertisement -

వెళ్ళిపోవాలని
నిర్ణయించుకున్నప్పుడు
నువ్వు నాకు
వీడ్కోలు చెప్పకపోవడమే
మేలని తలుస్తాను

చూస్తూ చూస్తూ
నిన్నిక ఎన్నటికీ చూడలేనన్న
నిజాన్ని చూడలేను నేను

నా కనుల ముందే
నువ్వు దూరమవ్వడాన్ని
చూస్తూ భరించలేను

దయచేసి
నువ్వు వెళ్ళిపోతావన్న మాటను
నా చెవిన పడకుండా చూడు

నువ్వు వెళ్లిపోయాక
నువ్విక లేవన్న విషయాన్ని
తెలుసుకోకుండా
జీవించేందుకు ప్రయత్నిస్తాను

నీవు వెళ్ళనే లేదని విశ్వసిస్తాను

నీవు ఎదురుపడనందుకు
విలపిస్తాను

శ్రీరామ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News