- Advertisement -
అమరావతి: ‘కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్’ కలను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..విజయవాడ నుంచి బెంగళూరుకు జూన్ 2 నుంచి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానాలు నడుస్తాయని, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాజధాని ప్రాంతం నుంచి బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చునని, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. విమాన (airlines) సర్వీసులు జూన్ 13 నుండి ప్రారంభమవుతాయని.. ఈ విమానాలు (airlines) వారానికి నాలుగురోజులు నడుస్తాయని అన్నారు. యూఎఈ, ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -