Tuesday, July 22, 2025

‘పెద్ది’ కోసం కొత్త అవతార్‌లో…

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పెద్ది’ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్- ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ఈ చిత్రం కీలకమైన, సుదీర్ఘమైన షెడ్యూల్ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ కీలకమైన ఫేజ్ కి ముందు రామ్ చరణ్ ఈ పాత్ర కోసం కొత్త అవతార్‌లోకి మారారు. పవర్‌ఫుల్ లుక్‌కి ఫిట్ అవడానికి ఫిజికల్‌గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వరుసగా కసరత్తులు చేస్తూ శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకున్నారు.

జిమ్‌లో తీసిన ఫోటో చూస్తే… రగ్డ్ బీర్డ్, ముడివేసి వేసిన జుట్టు, దృఢమైన శరీరంతో లుక్ అదిరిపోయింది. ఈ మార్పు కేవలం లుక్ కోసమే కాదు, పాత్రపై అతని అంకితభావానికి నిదర్శనం. గ్రీక్ గాడ్ లా కనిపిస్తున్న చరణ్ రెగ్యులర్ మోడ్ వదిలేసి బీస్ట్ మోడ్‌లోకి ఫుల్ గా మారిపోయాడు. చరణ్ పుట్టిన రోజు మార్చి 27న విడుదల కానున్న పెద్ది, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రం నుంచి కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవల అతని పుట్టినరోజున విడుదలైంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు డీవోపీగా పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News