- Advertisement -
వరంగల్: నగరంలోని మామునూరులో ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మార్చిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు ఇస్తూ.. ఎయిర్‌ఫోర్ట్స్ అథారిటీ(ఎఎఐ) నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన దస్త్రంపై సంతకం చేశారు. మరో 253 ఎకరాలు భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే.. కొత్త విమానాశ్రయ నిర్మాణం మొదలు పెడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -