- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుండి కొత్త వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేట్లను అమ లు చేసే అవకాశముంది. నవరాత్రి, పండుగ సీజన్లలో అనేక రంగాలలో డిమాండ్, అమ్మకాలను పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా చేసుకుంది. ప్రభుత్వం తక్షణమే రేటు మార్పులను ఆమోదించాలని జిఎస్‌టి కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేస్తోందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల ఆదాయ నష్టానికి సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి కూడా ఇది కృషి చేస్తుందని కేంద్రం భావిస్తోంది. జిఎస్‌టి కౌన్సిల్ 56వ సమావేశం సెప్టెంబర్ 3 నుండి 4 వరకు న్యూఢిల్లీలో జరుగనుంది. దీనిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్‌టి రేట్ల ప్రతిపాదనలు చర్చించనున్నారు.
- Advertisement -