Saturday, August 2, 2025

‘హ్రీం’ చిత్రం ఆరంభం

- Advertisement -
- Advertisement -

పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. (Hrim) రాజేశ్ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్ మీడియా పతాకంపై సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌కిషన్ క్లాప్‌నివ్వగా నటులు అలీ, బెనర్జీతో పాటు విజయేంద్రరెడ్డి, రాంబాబు పర్వతనేని… దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటులు రాజీవ్ కనకాల కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్ కిషన్ మాట్లాడుతూ శివ మల్లాల నిర్మిస్తున్న (Produced Shiva Mallala) ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ -ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ- ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనార్థనమహర్షి, కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్, హరీష్ నాగరాజ్, ముకేష్ ప్రజాపతి, బెజవాడ బేబక్క, వనిత, శ్రీవాణి త్రిపురనేని పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News